
సోషల్ మీడియా
రోజుల వ్యవధిలోనే సోషల్ మీడియాలో రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ నానో బనానా ట్రెండ్. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘గో విత్ ది ట్రెండ్’ అంటూ బనాన ట్రెండ్ ఫాలో కావడం విశేషం.
ఇంతకీ ఏమిటీ ట్రెండ్?
ఈ సరికొత్త వైరల్ త్రీడి ఫిగరీన్ ట్రెండ్ అనేది గూగుల్ వారి జెమిని 2.5 ఫ్లాస్ ఇమేజ్ టూల్‌కు సంబం«ధించింది. ఈ ట్రెండ్‌ను ‘నానో బనానా’ అనే నిక్‌నేమ్‌తో కూడా పిలుస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ ఏఐ టూల్ క్షణాల వ్యవధిలోనే ఏ ఫోటోను అయినా వాస్తవికత ఉట్టిపడేలా త్రీడీ మోడల్‌లోకి మారుస్తుంది. ఈ టూల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
టాలీవుడ్ నుంచి హాలివుడ్ వరకు హీరోల అభిమానులు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్‌లో మీరూ భాగం కావాలనుకుంటే ఇలా చేయండి...
∙గూగుల్ ఏఐ స్టూడియో వెబ్‌సైట్: గో టు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్లాలి. ∙ట్రై నానో బనాన ఆప్షన్ ఎంచుకోవాలి ∙ఫొటో ప్లస్ ప్రాంప్ట్ అనేది రికమెండెడ్ మెథడ్ ∙ప్లస్ బటన్ నొక్కి ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలి. ప్రాంప్ట్ ఇవ్వాలి