నేటికీ పీడిస్తున్న పోషకాహార లోపం | Acute Malnutrition in Children | Sakshi
Sakshi News home page

నేటికీ పీడిస్తున్న పోషకాహార లోపం

Mar 29 2026 12:55 AM | Updated on Mar 29 2026 12:55 AM

Acute Malnutrition in Children

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. అయినా, పోషకాహార లోపం మన దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఎక్కువగా పిల్లలు, మహిళలు పోషకాహార లోపంతో రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని పలు జాతీయ సంస్థల సర్వేలతో పాటు ‘పోషణ్‌ ట్రాకర్‌’–2024–25 గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

పోషకాహార లోపం వల్ల ఆరేళ్ల లోపు వయసు గల పిల్లల్లో పలువురు ఎదుగుదల లోపాలతో, వయసుకు తగిన బరువు పెరగక బాధపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నా, దేశంలో దాదాపు 2.10 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement