ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..

76 Year Old Woman Thought To Be Dead Wakes Up In Coffin At Funeral - Sakshi

ఓ మహిళ చనిపోయిందని వైద్యులు ధృవికరించారు. దీంతో బంధువులు ఆమె కడసారి చూపు కోసం కొద్ది గంటలు ఉంచి ఆ తర్వాత ఖననం చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలో శవపేటికలోంచి తడుతున్న శబ్దం. అంతే ఒక్కసారిగా బంధువులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఈక్వెడార్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఈక్వెడార్‌లోని ఒక ఆస్పత్రిలో బెల్లా మోంటోయా అనే 76 ఏళ్ల మహిళ కార్డియాక్‌ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు.

పునరుజ్జీవన ప్రయత్నాలకు స్పందించలేదని నిర్ధారించి మరీ ఆమె మృతిని ధృవీకరించారు. ఆమె జూన్‌13 ఉదయం ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వగా.. మధ్యాహ్నం చనిపోయినట్లు వైద్యుల ధృవీకరించారని ఆమె కుమారుడు గిల్బర్‌ రోడోల్ఫో బల్బెరన్‌ మోంటోయా చెబుతున్నారు. ఆమె కడసారి చూపు కోసం చాలా గంటల సేపు శవపేటికలో ‍ప్రదర్శనగా ఉంచారు. ఇక ఖననం చేసేందుకు తీసుకువెళ్తుండగా..ఒక్కసారిగా శవపేటికను తట్టిన శబ్దం వచ్చింది.

దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన బంధువులు శవపేటికను తెరిచి చూడగా..ఆమె ఊపిరి పీల్చుకోవడం కోసం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. వెంటనే హుటాహుటినా స్ట్రెచ్చర్‌ తెచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఈక్వెడార్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని బీబీసీ పేర్కొంది. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ..ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం మెరుగవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని,  ఆమె సజీవంగా ప్రాణాలతో నాతోనే ఉండాలని కోరుకుంటున్నా అని ఆవేదనగా చెప్పాడు.  

(చదవండి: అద్భుతం..అంతరిక్షంలో వికసించిన పువ్వు! ఫోటో వైరల్‌)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top