డయేరియానా? ఇలా చేసి చూడండి!

5 simple Home remedies for diarrhea - Sakshi

ఈ సీజన్‌లో నీళ్ల విరేచనాలు అయే అవకాశాలు ఎక్కువ. వాటికి మందులు తీసుకునేకంటే ఈ కింది తేలికపాటి చిట్కాలు పాటిస్తే సరి...
డయేరియాతో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారంలో అరటిపండు ఒకటి. అరటి పండులో ఉండే పొటాషియం అరుగుదలకి సహకరిస్తుంది. ఇందులో ఉండే పిండిపదార్థం పెద్దపేగులో నుండి నీరు, ఉప్పుని గ్రహిస్తుంది. ఫలితంగా మలం గట్టిపడుతుంది. ఇంకా ఈ పండులో ఉండే ఫైబర్‌ మోషన్‌ మామూలుగా అయేలా చేస్తుంది. 
పెరుగు
పెరుగు తేలికగా ఉంటుంది. సులువుగా అరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయాటిక్‌ మంచి బ్యాక్టీరియాని విడుదల చేస్తుంది. ఫలితంగా అరుగుదల బాగుండి పేగుల కదలికలు ఫ్రీగా మారతాయి.
యాపిల్‌
చెక్కు తీసిన యాపిల్స్‌  ఈ సమస్యకి బాగా హెల్ప్‌ చేస్తాయి. యాపిల్స్‌ ని స్ట్యూ చేసి కూడా తీసుకోవచ్చు.
కొబ్బరి నీరు
కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలెక్ట్రొలైట్స్‌ శరీరంలోని ఖనిజలవణాలను భర్తీ చేస్తాయి. నీళ్ల విరేచనాల ద్వారా నష్టపోయిన నీటి శాతాన్ని కొబ్బరినీరు పూరిస్తాయి.
జీలకర్ర నీరు
ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి ఒక టీ స్పూన్‌ జీలకర్ర వేసి మరిగించండి. తరువాత కొద్ది నిమిషాలు సిమ్‌ లో ఉంచండి. చల్లారిన తరువాత వడకట్టి తాగేయండి. ఇది ఇరిటేట్‌ అయి ఉన్న బవెల్స్‌ని చల్లబరుస్తుంది. బాడీని రీ హైడ్రేట్‌ చేస్తుంది.
మజ్జిగ
మజ్జిగ జీర్ణవ్యవస్థను చక్కబరుస్తుంది. మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపేస్తుంది. అయితే, మజ్జిగా తాజాగా ఉండాలి, ఏ మాత్రం పులుపు ఉండకూడదు. రుచికి చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవచ్చు.
మునగాకు
కొద్దిగా మునగాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోండి. ఇలా రోజుకి ఒకసారి మించి తీసుకోకూడదు. మునగాకు అరుగుదల సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. 
కిచిడీ
పెసర పప్పుతో చేసే కిచిడీ పొట్టకి తేలికగా ఉంటుంది. త్వరగా అరుగుతుంది. కావాల్సిన శక్తిని ఇస్తుంది.
ఉడికించిన బంగాళదుంపలు
ఉడికించిన బంగాళదుంపమీద కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల విటమిన్‌ సీ, బీ6 ని భర్తీ అవుతుంది.
ఏం తీసుకోకూడదు..?
∙పాలు, పన్నీర్, చీజ్, బటర్‌ పూర్తిగా ఎవాయిడ్‌ చేయండి. ప్రాసెస్డ్‌ ఫుడ్, బేక్డ్‌ ఫుడ్, షుగర్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకోకూడదు. ∙కాఫీ, టీ తగ్గించగలిగితే మంచిది. ∙వేపుళ్ళు తీసుకోరాదు. మీగడతో కూడిన ఆహారం మానితే మంచిది. ∙పండ్ల రసాలు కూడా మంచివి కావు. ∙బ్రకోలీ, క్యాబేజ్, ఉల్లిపాయ, కాలీ ఫ్లవర్‌ వంటివి తినకూడదు. ∙ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top