పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
చింతలపూడిలో తొలి పీఠం మాదే
పల్లె పోరులో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా కొనసాగింది. జిల్లాలో తొలి విడతలో జరిగిన పంచాయతీల్లో మేజర్ పంచాయతీలను కలుపుకుని కీలక స్థానాల్లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు సత్తాచాటారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తంగా 80.23 శాతం పోలింగ్ నమోదైంది.
దొరమామిడిలో ఓటేస్తున్నమాజీ ఎమ్మెల్యే బాలరాజు
చింతలపూడిలో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సచివాలయం వద్ద క్యూలైన్లో ఓటర్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లావ్యాప్తంగా తొలి విడ తలో 177 పంచాయతీలకుగాను 13 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ క్రమంలో 164 పంచాయ తీలు, 1,572 వార్డులకు 1,830 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 11 మండలాల్లో 4,32,401 మందికి 3,46,923 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 80.23 శాతంగా పోలింగ్ నమోదైంది. టి.నర్సాపురంలో అత్యధికంగా 41,282 మంది ఓటర్లకుగాను 35,555 మంది ఓటు హక్కు వినియోగించుకున్నా రు. అలాగే చింతలపూడి మండలంలో 50,671 మంది ఓటర్లకు 43,623 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. తొలుత వార్డుల వారీగా లెక్కింపు పూర్తి చేసి అనంతరం సర్పంచ్ స్థానానికి లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.
వైఎస్సార్సీపీ హవా
వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా అన్ని మండలాల్లో కొనసాగింది. వేలేరుపాడు మండలంలో మేజర్ పంచాయితీగా ఉన్న తాటిగొమ్మూరులో పార్టీ బలపర్చిన అభ్యర్థి 26 ఓట్లతో గెలుపొందారు. ఈ క్రమంలో టీడీపీ రీకౌంటింగ్‌కు డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తుంది. చింతలపూడి మండలంలో 18 స్థానాల్లో 8 పంచాయతీలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. అత్యధికంగా ఎర్రగుంటపల్లిలో పార్టీ బలపర్చిన అభ్యర్థి సీతారామిరెడ్డి 827 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కామవరపుకోటలో 15 పంచాయతీల్లో 7 పంచాయతీలు వై ఎస్సార్సీపీ దక్కించుకుంది. వేలేరుపాడు మండలంలో 9 పంచాయతీలకుగాను 3 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 2 స్థానాలు వైఎస్సార్సీపీ మద్దతునిచ్చిన సీపీఐ (ఎంఎల్) అభ్యర్థులు గెలుపొందారు. టి.నర్సాపురం మండలంలో 4, బుట్టాయగూడెంలో 8, జంగారెడ్డిగూడెం మండలంలో 11, జీలుగుమిల్లి మండలంలో 6, లింగపాలెం మండలంలో 6, కు క్కునూరు మండలంలో 6, పోలవరం మండలంలో ఒక పంచాయతీ, కొయ్యలగూడెం మండలంలో 3 స్థానాలను వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది.
చింతలపూడిలో ప్రశాంతంగా..
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చైర్పర్సన్ పదవితో పాటు మొత్తం 23 కౌన్సిలర్ వార్డులకు గానూ 23 పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 22,738 మంది ఓటర్లకు 15,014 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జీలుగుమిల్లిలో ఫ్యాన్ హవా
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చా టింది. మండలంలోని 12 పంచాయతీలకు గాను అత్యధికంగా ఆరు చోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. టీడీపీ ఐదు, స్వతంత్రులు ఒక పంచాయతీలో గెలుపొందారు. కూటమి ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొంటూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్వర్ణవారిగూడెంలో గుజ్జు సుబ్బలక్ష్మి, పి.అంకంపాలెంలో కుర్రం నాగమణి, దర్భగూడెంలో తెల్లం వెంకటేశ్వరరావు, కామయ్యపాలెంలో బోడిక వీరలక్ష్మి, టి.గంగన్నగూడెంలో చోడెం రాంబాబు, ములగలంపల్లిలో వనం నాగమణి గెలుపొందారు.
వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు
అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా
తొలి విడత పంచాయతీల్లో 80.23 శాతం పోలింగ్ నమోదు
అత్యధికంగా టి.నర్సాపురంలో 86.13 శాతం ఓటింగ్
ఓటు హక్కు వినియోగించుకున్న 3.46 లక్షల మంది..
65కు పైగా స్థానాల్లో ‘వైఎస్సార్సీపీ’ విజయదుందుభి
కామవరపుకోట: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. మండలంలోని తడికలపూడి, కామవరపుకోటల్లోని హైస్కూల్స్‌లోని కేంద్రాల్లో గురువారం పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. తొలి విడత బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూ రు, పోలవరం, టి.నరసాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మ ండలాల్లోని 164 గ్రామాల్లో సర్పంచ్‌లు, 1,567 వార్డ్ మెంబర్లకు ఎన్నికలు ని ర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల విధుల్లో 619 మంది ఆర్ఓ, ఏఆర్ఓ, జో నల్, రూట్ అధికారులను, 6193 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపా రు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఎంవీ రమణ, తహసీల్దార్ గెడ్డం ఎలీషా ఉన్నారు.
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీకి జరుగుతున్న తొలి ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులతో కలిసి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రజలంతా వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారని, తొలి నగర పంచాయతీ పీఠాన్ని కై వసం చేసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, నాయకులు జి.రాజేష్‌నాయుడు, నరేంద్ర రాజు తదితరులు ఉన్నారు.


