వైఎస్సార్‌సీపీ నేతపై జనసేన మూకల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై జనసేన మూకల దాడి

Nov 27 2026 1:26 AM | Updated on Nov 27 2026 1:26 AM

బుట్టాయగూడెం: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి పోల్నాటి కుమారి భర్త పోల్నాటి ప్రభాకరరావుపై జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రభాకరరావు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీనివాసపురం పంచాయతీ ఎన్నికల్లో కూట మి బలపర్చిన అభ్యర్థి నందిని 101 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి ఇంటిపై జనసేన నాయకులు దాడికి పాల్పడటంతో పాటు కుటుంబసభ్యులను భయభ్రాంతులు గురిచేశారు. అంతేకాకుండా మహిళలను అవమానించినట్టు ఆరోపించారు. జనసేన నాయకులు కొందరు వ్యక్తులు మోటార్‌ సైకిళ్లపై వచ్చి జెండా కర్రలతో ప్రభాకరరావుపై దాడి చేసి గాయపర్చడమే కాకుండా ఇంటి బయట గేట్లను మోటార్‌సైకిళ్లతో ఢీకొట్టినట్టు ఆరోపిస్తున్నారు. గాయపడిన ప్రభాకరరావును కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావుతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడకు పెద్దెత్తున తరలివచ్చి పరామర్శించారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

గాయపడిన వైఎస్సార్‌సీపీ నేత పోల్నాటి ప్రభాకరరావు

జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో దాడి వివరాలు తెలుసుకుంటున్న వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement