● రాజకీయాలంటేనే చిరాకు పుట్టిస్తున్న మంత్రి
● ఓటమి భయంతో దొంగ ఓట్లకు సిద్ధం
● వైఎస్సార్‌సీపీ కన్వీనర్ గుడాల గోపి ధ్వజం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఓటమిని అంగీకరించలేని మంత్రి నిమ్మల రామానాయుడు అడ్డదారులు తొక్కుతూ స్థానికంగా నిమ్మల రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం వైఎస్సార్‌సీపీ రా ష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీని అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌లో పెట్టడంపై ఆయన స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ఓటు వేయడానికి వెళ్లిన తాతాజీని మధ్యాహ్నం 1 గంట సమయంలో స్టేషన్‌కు తీసుకువెళ్లి సాయంత్రం 4 గంటలకు వదలడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. పా లకొల్లు నియోజకవర్గంలో నిరంకుశ పాలన న డుస్తోందన్నారు. గురువారం తాతాజీ ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఓ టీడీపీ కార్యకర్త ఓ వృద్ధురాలిని పోలింగ్ కేంద్రంలోనికి తీసుకువెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసుకుని దొంగ ఓట్లకు పాల్పడుతుండగా అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఓ మహిళా కార్యకర్త ఇలా దొంగ ఓట్లకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అయితే పోలీసులు వచ్చి తాతాజీని అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా.. లేక రామానాయుడు రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా అని గోపీ ప్రశ్నించారు. దొంగ ఓట్ల వ్యవహారాన్ని అడ్డుకోవాల్సింది పోయి తాతాజీని అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. మంత్రి రా మానాయుడు ప్రచారం తప్ప ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టే.. భయపడి దొంగ ఓట్లు వేసుకోవడా నికి తాతాజీని అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ఓడిపోతున్నామనుకున్న ప్రాంతాలకు వెళ్లి ప్రతిపక్షాలకు ఓటు వేస్తే రోడ్లు, నీళ్లు, అభివృద్ధి జరగదని మంత్రి నిమ్మల బెదిరించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా భయభ్రాంతులతో గెలిచే గెలుపు కూడా గెలుపేనా అని అన్నారు.


