నిడమర్రు: అధికార పార్టీ ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా ధైర్యంగా ఒక గ్రామాన్ని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఏకగ్రీవం చేయడానికి కృషి చేసిన వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు, టీటీడీ మాజీ సభ్యుడు గాదిరాజు వెంకట సుబ్బరాజు (పెదబాబు)ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. నిడమర్రు మండలం మందలపర్రు పంచాయతీ సర్పంచ్, 10 మంది వార్డు సభ్యులుగా వైఎస్సార్‌సీపీ మద్దతుదా రులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనికి విశేష కృషి చేసిన సుబ్బరాజును జగన్ ప్రత్యేకంగా అభినందించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్‌గా ఎన్నికై న బట్రాజు కనకవరప్ర సాద్ ఎలియాస్ బాస్‌తో పాటు ఉప సర్పంచ్ బే తాళ నాని గణేష్, మాజీ సర్పంచ్ దెందుకూరి త్రి మూర్తిరాజు, నూతన పంచాయతీ సభ్యులను సుబ్బరాజు వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు.


