అభివృది్ధ జాడేది..సంక్షేమం ఊసేది? | - | Sakshi
Sakshi News home page

అభివృది్ధ జాడేది..సంక్షేమం ఊసేది?

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

గత పాలనతో పోలిక.. ఎన్నికలపై ప్రభావం

భీమవరం(ప్రకాశం చౌక్‌): కూటమి ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నా జిల్లాలో పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా మందగించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను, స్థానిక సమస్యలను ప్రజాప్రతినిధులు పరిష్కరించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. అంతటా మౌలిక వసతుల లేమి, సంక్షేమానికి మంగళం పాడటంతో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారు.

రహదారులు, తాగునీరు అధ్వానం

పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు ధ్వంసమై, కనీస తాగునీరు, డ్రైనేజీ వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 409 గ్రా మాలు, ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచా యతీలో నిధులున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

సూపర్‌ సిక్స్‌ మోసం

మహిళలకు ఆడబిడ్డ నిధి నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు వంటి హామీలు అమలు కాలేదు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాక దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.

నిలిచిపోయిన పథకాలు : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక, ప్రమాద బీమా పథకాలను సమర్థంగా అమలు చేయగా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. జిల్లాలో దాదాపు 600 బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయి. కౌలు రైతులకు రైతుభరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం అందడం లేదు. కొత్త ఇళ్ల మంజూరును కూడా ప్రభుత్వం పక్కనబెట్టింది.

పెరిగిన ధరలు : నిత్యావసర సరుకులు, బియ్యం, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం నియంత్రించలేకపోయింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

ఉద్యోగులపై వేధింపులు : హక్కుల కోసం పోరాడుతున్న సచివాలయ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై కేసులు, వేధింపులు ఎక్కువయ్యాయి. వేతనాలు కూడా సమయానికి చెల్లించకపోవడంతో ఉద్యోగ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.

కూటమిపై కన్నెర్ర!

గ్రామ, పట్టణాల్లో ఎక్కడికక్కడే సమస్యలు

అమలు కాని సూపర్‌సిక్స్‌ హామీలు

ఓట్ల కోసం వస్తే నిలదీయడానికి ప్రజలు సిద్ధం

అధికారం అండతో గెలిచేందుకు కూటమి యత్నాలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పనులను గుర్తుచేసుకుంటున్న ప్రజలు

గత ప్రభుత్వంలో సచివాలయాలు, వైఎస్సార్‌ డిజిటల్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల వంటి శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా స్థానికంగానే సేవలు అందేవని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఏడాదికి రెండుసార్లు పింఛన్లు పెంచడం, ప్రతినెలా క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు జమ చేయడం వంటి పారదర్శక పాలనను నేడు ఆకాంక్షిస్తున్నారు. ఈ తరుణంలో సమస్యలు పరిష్కరించకుండా అధికార, ఆర్థిక బలంతో స్థానిక ఎన్నికల్లో గెలవాలని కూటమి చూస్తోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ వైఫల్యాలపై ఓటు రూపంలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండటంతో, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మంచి అవకాశం లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement