జాతీయ రహదారిపై వేర్వేరు ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై వేర్వేరు ప్రమాదాలు

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

జాతీయ రహదారిపై వేర్వేరు ప్రమాదాలు

ఉంగుటూరు: జాతీయ రహదారిపై కై కరం–చేబ్రోలు మధ్య బుధవారం రెండు వేర్వేరు ప్రమా దాలు చోటుచేసుకున్నాయి. ఒకేచోట జరిగిన ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లిగూడెం వైపు మార్గంలో కై కరం పె ట్రోలు బంకు దాటిన తర్వాత డివైడరు వద్ద ముందువెళ్లే మోటారుసైకిల్‌ని వెనుక నుంచి కారు ఢీకొట్టి పక్కనున్న తుప్పల్లో తిరగబడింది. ఈ ప్రమాదంలో మోటార్‌ సైక్లిస్ట్‌ పెద్దిరెడ్డి సూర్యనారాయణ(60) గాయాలయ్యాయి. ఆయన్ను అంబులెన్సులో తాడేపల్లిగూడెం ఏరియా అసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదాన్ని చూస్తూ డ్రైవ్‌ చేస్తున్న మరో కారును లారీ ఢీకొట్టింది. దీంతో పెద్దగా ప్రమాదం జరగకపోయినా కారు కొద్దిగా దెబ్బతింది. మోటార్‌ సైక్లిస్ట్‌ను ఢీకొట్టిన కారు మాత్రం బాగా దెబ్బతింది. ప్రమాదాలతో వాహనాలు నిలిచిపోగా హైవే పెట్రోలింగ్‌ అధికారులు, జాతీయ రహదారి సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement