జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలోని జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లాలోని 27 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ), 27 మండల పరిషత్‌ అధ్యక్ష పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె.వెట్రిసెల్వి బుధవారం ప్రకటనలో తెలిపారు.

జెడ్పీటీసీల రిజర్వేషన్లు

జిల్లాలో 27 జెడ్పీటీసీల పదవులకు ఎస్టీలకు 4 స్థానాలు కేటాయించగా వాటిలో రెండు మహిళలకు, రెండు జనరల్‌కు, ఎస్సీలకు 6 స్థానాలు కేటాయించగా వాటిలో 3 మహిళలకు, జనరల్‌కు 3, వెనుకబడిన తరగతులకు 3 స్థానాల్లో 1 మహిళలకు, 2 జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 14 స్థానాలు రిజర్వు కాని కేటగిరీకి కేటాయించగా వాటిలో 7 స్థానాలు మహిళలకు, 7 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. మొత్తం 27 స్థానాలలో 13 స్థానాలు మహిళలకు, 14 స్థానాలు జనరల్‌కి కేటాయించినట్టు ప్రకటించారు.

ఎంపీపీల రిజర్వేషన్లు

జిల్లాలోని 27 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు సంబంధించి ఎస్టీలకు కేటాయించిన 4 స్థానాల్లో రెండు మహిళలకు, రెండు జనరల్‌కు లభించాయి. ఎస్సీలకు కేటాయించిన 6 స్థానాల్లో మహిళలకు 3, జనరల్‌కు 3, బీసీలకు కేటాయించిన 3 స్థానాల్లో 1 మహిళలకు, 2 జనరల్‌కు దక్కాయి. మిగిలిన 14 స్థానాలు రిజర్వు కాని కేటగిరీకి కేటాయించగా వాటిలో 7 స్థానాలు మహిళలకు, 7 స్థానాలు జనరల్‌కు దక్కాయి. మొత్తంగా 27 స్థానాల్లో 13 స్థానాలు మహిళలకు, 14 స్థానాలు జనరల్‌కి కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement