ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్పెషల్ టెట్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 373 మందికి 359 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 375 మందికి 359 మంది హాజరయ్యారు. పరీక్షలను డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు.


