మేత.. మోత.. వాత | - | Sakshi
Sakshi News home page

మేత.. మోత.. వాత

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

మేత.. మోత.. వాత ఏకపక్షంగా ధరల పెంపు రైతులను పట్టించుకోరా? ఖాళీగా చెరువులు పంట విరామం తప్పదు!

మేత ధరలు తగ్గించాలి

భీమవరం: ఆక్వా రైతులను అందలమెక్కిస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు, కూటమి నాయకులు ఫీడ్‌, సీడ్‌ ధరలను కంపెనీలు విచ్చలవిడిగా పెంచుతుంటే చోద్యం చూస్తున్నారంటూ రైతు లు మండిపడుతున్నారు. అప్సడా చట్టానికి విరుద్దంగా ఫీడ్‌ ధరలను ఫీడ్‌ కంపెనీల యజమానులు ఏకపక్షంగా పెంచుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆక్వా రైతులందరికీ జోన్స్‌ ప్రమేయం లేకుండా సబ్సిడీ విద్యుత్‌ ఇస్తామని, రొయ్యల ధరలు తగ్గకుండా, ఫీడ్‌, సీడ్‌ ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తోపాటు కూటమి నాయకులు ఊదరగొట్టారు. అయితే గద్దెనెక్కిన తర్వాత ఆక్వారంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అప్సడా చట్టానికి తూట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 90 వేలు, ఏలూరు జిల్లాలో దాదాపు 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగుచేస్తుండగా గత ఫిబ్రవరి నుంచి ఫీడ్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో నష్టాలపాలవుతున్న రైతులు రొయ్యల మేత బస్తాలను తగులబెట్టడం, రొయ్యలను రోడ్డుపై పోవడం వంటి నిరసనలు చేపట్టారు. అలాగే సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. అయినా కంపెనీలు 8 నెలల్లో టన్నుకు రూ.27 వేల ధరలు పెంచాయి. అప్సడా చట్టం ప్రకారం ఆక్వా రైతులు, ఫీడ్‌ కంపెనీ యజమానులు, మత్స్యశాఖ అధికారులతో సమావేశంలో నిర్వహించి ధరలపై నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. గత ఫిబ్రవరి నుంచి ఫీడ్‌ కంపెనీలు రెండు విడతల్లో టన్నుకు రూ.16 వేల వరకు పెంచగా తాజాగా రూ.11 వేలు పెంచడానికి సిద్ధం కావడం రైతులను ఆందోళన కలిగిస్తోంది.

ఫీడ్‌ కంపెనీలు అప్సడా చట్టానికి విరుద్ధంగా మేతల ధర లు ఏకపక్షంగా పెంచుతూ రైతులను ఇబ్బందులు పాలుచేస్తున్నాయి. రైతులు, మ త్స్యశాఖ అధికారులు, ప్రభు త్వ పెద్దల సమక్షంలో మేత ధరల పెంపుపై ని ర్ణయం తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫీడ్‌ ధరల పెంపుపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే సాగు కష్టమే.

– మళ్ల తులసీరామ్‌ (రాంబాబు)

ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ఆక్వా రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫీడ్‌ ధరలను తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా మేతల ధరలు పెంచుతున్న ఫీడ్‌ కంపెనీలకు కొమ్ముకాయడం దారుణం. ఇప్పటివరకు క్రాప్‌ హాలీడే ప్రకటనల వరకే పరిమితం కాగా ఇక చేపట్టక తప్పదు.

– బొల్లెంపల్లి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, అండలూరు

రొయ్యల ధరల్లో నిలకడలేకపోవడంతోపాటు తెగుళ్ల వ్యాప్తితో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో చాలా మంది చెరువులను ఖాళీగా ఉంచుతున్నారు. కొందరు అప్పులు చేసి సాగు చేస్తున్న తరుణంలో మేత ధరలు పెంచితే మొత్తం సాగు కుంటుపడే ప్రమాదముంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు

ఓ పక్క రొయ్యలకు తెగుళ్లు, నిలకడ లేని ధరలతో సతమతమవుతున్న తరుణంలో ఫీడ్‌ ధరల పెంపుతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో పలుమార్లు క్రాప్‌ హాలీడే చేపట్టాలని నిర్ణయానికి వచ్చినా రొయ్యల సాగుపై ఆధారపడ్డ అనుబంధ పరిశ్రమలు, లక్షలాది మంది కార్మికులు జీవనం రోడ్డున పడే ప్రమా దం ఉండటంతో విరమించుకున్నారు. మరోమారు ఫీడ్‌ ధరలు పెంచితే క్రాప్‌ హాలీడే తప్పదని రైతులు అంటున్నారు.

ఆక్వా ఫీడ్‌ దోపిడీ !

మరోసారి మేత ధరల పెంపు

8 నెలల్లో టన్నుకు రూ.27 వేలు పెరుగుదల

ఇప్పటికే సంక్షోభంలో ఆక్వా సాగు

ప్రభుత్వం పట్టించుకోకపోతే క్రాప్‌ హాలీడే తప్పదంటున్న రైతులు

ఫీడ్‌ కంపెనీల

దోపిడీ అరికట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement