● సాగు నీరు.. అందని తీరు
● ఎండ తీవ్రత.. విద్యుత్ కోత
కుక్కునూరు: ఓ వైపు ఎండ తీవ్రత.. మరోవైపు విద్యుత్ కోతలు.. వెరసి రైతులకు సాగునీటి కష్టా లు తప్పడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో విలీన మండలాల్లోని మిర్చి, అరటి పంటలు సాగు చేసే రైతులు సాగునీరందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాను న్న రోజుల్లో ఎండలు మరింత పెరిగితే పంటల పరిస్థితి ఏంటని ఆందోళన చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించగా.. వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. కుక్కునూరు ప్రాంతంలో పలువురు రైతులు మిర్చి సాగు చేశారు. ప్రస్తుతం పంటకు క్రమం తప్పకుండా నీరు అందించాల్సి ఉండగా విద్యుత్ కోతలు అడ్డంకిగా మారాయి. దీంతో రైతులు పంట నష్టపోతామని ఆందోళన చెబుతున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.


