బియ్యం కుతకుత ! | - | Sakshi
Sakshi News home page

బియ్యం కుతకుత !

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● 26 కిలోల బస్తా రూ.2,100

● నాలుగు నెలల్లో 80 శాతం పెరుగుదల

● కుటుంబ బడ్జెట్‌ రెట్టింపు

నూజివీడు: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి నూరు శాతం భారంగా మారుతున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,200 నుంచి రూ.1,350 వరకు ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.2,100కి చేరింది. ఒకేసారి ఇంత మొత్తాన్ని వెచ్చించాల్సి రావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా కష్టతరంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ధర రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో బియ్యం ధరలు 80 శాతం వరకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం

● కుటుంబ ఖర్చులు: ఒకవైపు బియ్యం ధరలు భారీగా పెరగడంతో పాటు, మరోవైపు కూరగాయలు, విద్యుత్‌ బిల్లులు, పిల్లల చదువులు, వంటగ్యాస్‌, ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి.

● ఆదాయానికి కోత : కూలీలు, వేతన జీవుల ఆదాయాలు పెరగకపోయినా, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతుండటంతో కనీసం పొదుపు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది.

● నాణ్యతపై ప్రభావం : పెరుగుతున్న ఖర్చుల కారణంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఈ ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌ ధరలను ప్రభుత్వాలు సమీక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement