ఉత్సాహంగా సాఫ్ట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా సాఫ్ట్‌బాల్‌ పోటీలు

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

ఉత్సాహంగా సాఫ్ట్‌బాల్‌ పోటీలు శ్రీనివాసా.. గోవిందా ప్రాచీన కళలకు ప్రోత్సాహం అభినందనీయం అఖిల భారత ట్రెక్కింగ్‌ క్యాంపునకు రాజేష్‌

పెదవేగి : స్థానిక అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో జరుగుతున్న 70వ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ సాఫ్ట్‌బాల్‌ అండర్‌–19 పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం పోటీలు క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్‌ సెక్రటరీ కందికొండ జయరాజ్‌ తెలిపారు. బాలికల విభాగంలో గుంటూరు జట్టు విజయనగరం జ ట్టుపై 5–0, కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 30–21, తూర్పుగోదావరి జట్టు పశ్చిమగోదావరిపై 13–2, నెల్లూరు జట్టు అనంతపురంపై 7–5 స్కోరుతో గెలిచి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయన్నాయన్నారు. అలాగే బాలురు విభాగంలో విజయనగరం, అనంతపురం, పశ్చిమగోదావరి, విశాఖ, గుంటూరు, కడప, నెల్లూ రు, కృష్ణా జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకోగా.. విజయనగరం జట్టు అనంతపురం జట్టుపై 6–2, పశ్చిమగోదావరి జట్టు విశాఖపై 6–0 స్కోరుతో గెలిచి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయన్నారు. మిగిలిన నాకౌట్‌ మ్యాచ్‌లు సోమ వారం నిర్వహించనున్నారు.

ద్వారకాతిరుమల: దసరా సెలవుల నేపథ్యంలో ద్వారకాతిరుమల క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు స్వా మివారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. దర్శన క్యూలైన్లతోపాటు ఉచిత ప్రసాదం పంపిణీ కేంద్రం, అన్నదాన విభాగం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల సందడి కొనసాగింది.

చిట్టూర్పు(ఘంటసాల): దసరా సందర్భంగా ప్రాచీన కళలను ప్రోత్సహించేలా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఘంటసాల మండలం చిట్టూర్పులో భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కమిటీ సభ్యులు, పీఏసీఏస్‌ చైర్మన్‌ గుత్తికొండ ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలను ఎమ్మెల్యే ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనే కళాకారులు స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొని, ఉన్నత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలన్నారు. ఈ పోటీలు ఈనెల 19 వరకు జరుగుతాయని నిర్వాహకుడు గుత్తికొండ ప్రసాద్‌ తెలిపారు.

భీమవరం: నాగాలాండ్‌లోని వోఖాలో నిర్వ హించే ఎన్‌ఈఆర్‌ ట్రెక్కింగ్‌ క్యాంపునకు భీమవరం డీఎన్నార్‌ కళాశాల సీనియర్‌ డివిజన్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌ కోల రాజేష్‌ ఎంపికై నట్టు ప్రిన్సిపల్‌ బీవీ నర్సింహరాజు తెలిపారు. ఈనెల 17 నుంచి 24 వరకు జరిగే క్యాంపులో రాజేష్‌ పాల్గొంటాడన్నారు.రాజేష్‌ను కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, ఎన్‌సీపీ ఆఫీసర్‌ ఎ.వీరయ్య అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement