పూర్తికాని పంట కాలువలు
చర్యలు తీసుకుంటాం
పరిహారం చెల్లించాలి
బుట్టాయగూడెం : పోగొండ రిజర్వాయర్‌తో రైతు ల ఆశలు నెరవేరడం లేదు. పాలకుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన ఉండటం లేదంటూ బుట్టాయగూడెం మండలం చింతలగూడెం సమీపంలో పోగొండ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు రూ.26.02 కోట్ల నిధులను విడుదల చేశారు. అలాగే పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే వైఎస్సార్ మరణానంతరం పనులు నెమ్మదించాయి. తిరిఇ 2014లో రూ.85.50 కోట్ల నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యాయి. అయితే పదేళ్ల పాటు కొనసాగిన ఈ పనులకు సుమారు రూ.129.50 కోట్లతో ప్రాజెక్టు వ్యయం పెరిగింది. పూర్తిస్థాయిలో పనులు జరగకుండానే 2018 ఫిబ్రవరి 19న అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. కనీసం భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం కూడా అందించలేదనే విమర్శలు ఉన్నాయి. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పరిహారం, ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో చేపట్టడంతో శ్రద్ధ చూపడం లేదని రైతులు వాపోతున్నారు.
7,600 ఎకరాలకు నీరందేలా లక్ష్యం
పోగొండ రిజర్వాయర్ ద్వారా బుట్టాయగూడెం మండలంలోని రాచూరు, లంకాలపల్లి, కుమ్మరిగుంట, లక్ష్ముడుగూడెం, రామన్నగూడెం గ్రామా ల్లో సుమారు 4,000 వేల బీడు భూములకు సాగు నీరు అందించాలన్నదే లక్ష్యం. వీటితోపాటు కొ య్యలగూడెం మండలంలోని 3,600 ఎకరాలకు స్థిరీకరణ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా పంట కాలువల పనులు పూర్తికాలేదు. కుడి కాలువ పరిధిలో 5 గ్రామాల పరిధిలో 1,000 ఎకరాలు, ఎడమ కాలువ పరిధిలో 500 ఎకరాలు సాగునీరు అందించేందుకు పనులు జరగడం లేదు. దీంతో ఆయా గ్రామాల పరిధిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఇటివల అల్లికాలువ సమీపంలో ఎన్‌హెచ్–365 బీబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమేర రోడ్డు వేసిన ప్రాంతంలో అధికారులు కాలువకు మినీ వంతెన నిర్మించారు. కొద్ది దూరం మాత్రమే పనులు చేశారు. అయితే ఆయా గ్రామాల పరిధిలో పంట కాలువల ఏర్పాటుకు భూమిని కోల్పోయిన 1,400 మందికి పరిహారం కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికై న పరిహారం చెల్లించడంతోపాటు పంట కాలువల పనులు పూర్తి చేసి తమ పొలాలకు సాగు నీరు అందించాలని పోగొండ రైతులు కోరుతున్నారు.
అసంపూర్తిగా పోగొండ రిజర్వాయర్ పనులు
పంట కాలువల్లోకి పారని నీరు
13 గ్రామాల రైతులకు ఇక్కట్లు
7,600 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం
పోగొండ రిజర్వాయర్ పంట కాలువ పనులను ఉపాధి హామీ పథకంలో రైతులే చేసుకునేలా ఎలైన్‌మెంట్స్ ఇచ్చాం. అయితే పరిహారం ఇస్తేనే పనులు జరుగుతాయని రైతులు చెప్పారు. దీంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– టి.సురేష్, ఏఈ, కేఆర్‌పురం, బుట్టాయగూడెం మండలం
పోగొండ రిజర్వాయర్‌లో పంట కాలువలకు సంబంఽధించి భూములు కోల్పోతున్న రైతులకు కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించేలా కృషి చేయాలి. నాడు ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించారు. ఆ సమయంలో నిర్వాసితులంతా చంద్రబాబు దృష్టికి సమస్యలను తీసుకువెళ్లాం. అయినా కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికై నా పరిహారం ఇప్పించడంతోపాటు పంట కాలువ పనులు పూర్తిచేయాలి.
– బన్నే బుచ్చిరాజు, మాజీ సర్పంచ్, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం


