దాడులకు భయపడే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

దాడులకు భయపడే ప్రసక్తే లేదు

Oct 11 2026 1:21 AM | Updated on Oct 11 2026 1:21 AM

మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు

ఆగిరిపల్లి: మంత్రి కొలుసు పార్థసారథి అను చరులు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తే భయపడే ప్రసక్తే లేదని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు హెచ్చరించారు. మండలంలోని ఈదులగూడెంలో పార్టీ నూజివీడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ ఈలప్రోలు వెంకట సుబ్బయ్య ఇంటి ఆవరణలోని ద్విచక్ర వాహనాలు, ఫర్నిచర్‌ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టి బీభత్సం సృష్టించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి సుబ్బయ్య, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే నూజివీడులో వలస వచ్చిన నాయకులు చేసే అక్రమాలపై పోరాటం చేసిన వారిపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా కోటగిరి హనుమంతరావు, పాలడుగు వెంకట్రావుపై కూడా రాజకీయంగా పోరాటం చేశామని.. ఎప్పుడూ ఇటువంటి దాడులు జరిగిన సంఘటనలు లేవన్నారు. ఇప్పు డు సుబ్బయ్య ఇంట్లోకి వెళ్లి ద్విచక్ర వాహనాలను, ఫర్నిచర్‌ను తగులబెట్టగా.. గ్రామస్తుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని లేకుంటే సగం ఇల్లు దగ్ధమైపోయేదన్నారు.

అక్రమాలను అడ్డుకుంటున్న సుబ్బయ్య

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంత్రి పార్థసారథి, ఆయన అనుచరులు చేస్తున్న అక్రమాలపై నిరంతరం సుబ్బయ్య పోరాటం చేస్తున్నారనే అక్కసుతోనే ఇలాంటి దాడులకు పా ల్పడ్డారని ప్రతాప్‌ అప్పారావు మండిపడ్డారు. తో టపల్లిలో మంత్రి కుమారుడికి చెందిన బయో గ్యాస్‌ ప్లాంట్‌ కోసం కొండలను చదును చేస్తున్నామనే పేరుతో కూటమి నేతలు అక్రమంగా గ్రావెల్‌ను తరలించి రూ.కోట్ల దండుకున్నారని ప్రతాప్‌ అప్పారావు ఆరోపించారు. దీనిపై సుబ్బ య్య హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో మంత్రి అనుచరులు కావాలనే సుబ్బయ్య ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడబోమని, ప్రతి కార్యకర్త, నాయకుడికి వైఎస్‌ జగన్‌ అండగా ఉంటారన్నారు. గ్రామం నడిబొడ్డున ఇంత దారుణం జరిగితే కనీసం ఎస్సై, సీఐ వచ్చి విచారణ చేయలేదని, ఎవరినీ మర్చిపోబోమని హెచ్చరించారు. సీసీ పుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, నూజివీడు టౌన్‌ పార్టీ అధ్యక్షుడు శీలం రాము, నూజివీడు రూరల్‌ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివ, నాయకులు బోయపాటి శ్రీను, గుండ్ల హనుమంతరావు, రాఘవరపు సురేష్‌, ఎస్‌కే సుభాని, కంబాల ప్రదీప్‌, వేము రాజు, కారుకొండ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement