ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీపై అమావాస్య ఎఫెక్ట్ పడింది. ప్రతివారం భక్తులతో కిటకిటలాడే ప్రాంగణాలు బోసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. దసరా సెలవులు కావడంతో ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్లే భవానీ భక్తులు మార్గమధ్యలోని ద్వారకాతిరుమల క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. దీంతో భక్తుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నారు.


