మిర్చి.. నష్టాల్లో ముంచి ! | - | Sakshi
Sakshi News home page

మిర్చి.. నష్టాల్లో ముంచి !

Oct 11 2026 1:21 AM | Updated on Oct 11 2026 1:21 AM

గిట్టుబాటు ధర కల్పించాలి

● సాగుపై నిరాసక్తత

● పంటకు గిట్టుబాటు కరువు

● ఏటేటా తగ్గుతున్న విస్తీర్ణం

లింగపాలెం: జిల్లాలోని మెట్ట ప్రాంతమైన లింగపాలెం మండలం మిర్చి పంటకు ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, బోరుబావుల్లో నీటి మట్టాలు తగ్గిపోవడంతో మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. గత ఏడాది పండించిన ఎండుమిర్చికి సరైన గిట్టుబాటు ధర దక్కక రైతులు అప్పులపాలయ్యారు. గతంలో మండలంలో సుమారు 400 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ఈ ఏడాది కేవలం 100 నుంచి 110 ఎకరాలకే పరిమితమవుతుందని అధికారుల అంచనా. అధికంగా సాగు చేసే ధర్మాజీగూడెం ప్రాంతంలోనూ సాగు విస్తీర్ణం 96 ఎకరాల నుంచి 45–60 ఎకరాలకు పడిపోయింది. పండిన పచ్చిమిర్చిని ముంబై, ఢిల్లీ, పూణే వంటి నగరాలకు ఎగుమతి చేస్తారు.

నష్టాల బాటలో..

ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. క్వింటా ఎండు మిర్చి నాణ్యతను బట్టి రూ.14,000 నుంచి రూ.15,000 ధర మాత్రమే పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా కనీసం రూ.22,000 ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.

పర్యవేక్షణ కరువు

మరోవైపు మండలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపులపై వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మిర్చి పంటకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

మిర్చి సాగుకు పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాం. పైరుకు పలు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నారుమడులు వేసినా వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. రైతుల పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకుని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.

– ఎస్‌.రామలింగాధరరావు, రైతు, ధర్మాజీగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement