ఏలూరు టౌన్: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. పార్టీ ఏలూరు నగర ఉపాధ్యక్షుడు రియాజ్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ సమక్షంలో ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ ముస్లిం మైనార్టీ ముఖ్యనేత షేక్ మ క్భూల్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతోపాటు నగరంలోని ముస్లిం మైనార్టీలకు చెందిన 100 కుటుంబాలు పార్టీలో చేరారు. డీఎన్నార్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ కూటమి పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోర వైఫల్యంతో తీవ్ర అసంతృప్తి మూటగట్టుకున్నారనీ, ప్రజలకు మేలు చేసే మాజీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయాలనే ఆకాంక్షతో పార్టీలో చేరినట్టు ముస్లిం మైనార్టీలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ నాడు దివంగత సీఎం వైఎస్సార్ ముస్లిం మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్రలో నిలిచిపోయారని స్పష్టం చేశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ రంగంలో పెద్దపీట వేశారనీ, సంక్షేమ పథకాలతో ఆదుకున్నారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం హామీలను అమలు చేయలేని దుస్థితిలో సర్కారు ఉందని డీఎన్నార్ అన్నారు.
ఏ వర్గమూ సంతోషంగా లేదు
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి పా లనలో ప్రజల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయనీ, ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఏలూరు ని యోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాబో యే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ల బాచి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మానియేల్ జయకర్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.


