ఐఆర్‌ ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఐఆర్‌ ప్రకటించాలి

Oct 11 2026 1:21 AM | Updated on Oct 11 2026 1:21 AM

ఐఆర్‌ ప్రకటించాలి నిమజ్జనం కాక.. మెట్లపై నిలిచి.. ఉత్సాహంగా బేస్‌బాల్‌ పోటీలు 16 నుంచి టెన్నిస్‌ టోర్నీ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 12వ పీఆర్‌సీకి ఇప్ప టికే మూడేళ్లు ఆలస్యమైన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని ఏపీ ఎన్జీఓస్‌ అసో సియేషన్‌ కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక ఇరిగేషన్‌ డేటా కాంప్లెక్స్‌లో జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వం ఇటీవల ఉద్యోగులకు రెండు డీఏలు, పీఆర్‌సీ కమిటీ నియామకం, పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ హెచ్చింపు, హెల్త్‌ కార్డుల క్రమబద్ధీకరణ వంటి చర్యలను స్వాగతిస్తున్నామన్నారు. జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాఽథ్‌, ఏలూరు తాలూకా అధ్యక్షుడు గొన్నూరి శ్రీధర్‌రాజు, కార్యదర్శి చంద్రశేఖర్‌, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు తోట కుసుమకుమారి, జిల్లా మహిళ విభాగం చైర్‌పర్సన్‌ కె.సునీత, జిల్లాలోని 9 తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: గణపతి నవరాత్రుల సందర్భంగా పట్టిసీమ శివక్షేత్రం రేవులో గోదావరిలో నిమజ్జనం చేసి వినాయక విగ్రహాలు మెట్లపైకి కొట్టుకొచ్చాయి. మండలంతో పాటు పలు ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకువచ్చి ఇక్కడ నిమజ్జనం చేశారు. అయితే నదిలో ప్రవాహం తగ్గడం, పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో విగ్రహాలు ఇలా రేవులో మెట్లపైకి కొట్టుకువచ్చి నిలిచిపోయాయి. దీంతో స్నానానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతు న్నారు. పంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి మెట్లను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. మహాలయ అమావాస్య సందర్భంగా పట్టిసీమ రేవులో శనివారం పలువురు భక్తులు స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు అర్పించి పిండ ప్రదానాలు చేశారు.

పెదవేగి: పోటీతత్వం, నిరంతర సాధన, లక్ష్యంపై గురితో క్రీడల్లో రాణించవచ్చని విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శేఖర్‌ అన్నారు. శనివారం పెదవేగిలోని గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి అండర్‌–19 బేస్‌బాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా శేఖర్‌ హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారులుగా ప్రతి విద్యార్థి ఎదగటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని కృషి చేయాలన్నారు. ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌బాబు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోటీలను ప్రారంభించారు. బేస్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరావు, ఎంఈఓ అరుణ్‌, అబ్జర్వర్‌ రామకృష్ణ, పీడీ కేజే రాజు తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: స్థానిక కాస్మో కల్చరల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఆధ్వర్యంలో టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని కాంప్లెక్స్‌ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 22 వరకు సీహెచ్‌ బుద్దావతారం రాజు మెమోరియల్‌ ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. 45, 55, 65,70 విభాగంలో సీనియర్‌ సింగిల్స్‌, డబుల్స్‌.. 75 విభాగంలో డబుల్స్‌ పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు రూ.3 లక్షలు బ హుమతులుగా అందిస్తామన్నారు. క్రీడాకారులు సెల్‌ 9885750999లో సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement