జంగారెడ్డిగూడెం(చింతలపూడి): స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం సాయంత్రం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనున్నాయి. రాజమండ్రికి చెందిన పానంగిపల్లి సత్య పవన్ కుమార్ ఆచార్యులు యజ్ఞ బ్రహ్మగా వ్యవహరించగా, ప్రధానార్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. సంవత్సర కాలంలో ఆలయంలో జరిగే పూజల్లో, నివేదనల్లో తెలిసికానీ తెలియకకానీ జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త కొప్పుల నాగ సురేంద్రతో కలిసి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మానికల రాంబాబు పర్యవేక్షించారు.


