క్షేత్రంలో వరుణ యాగానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

క్షేత్రంలో వరుణ యాగానికి సర్వం సిద్ధం

Oct 6 2026 12:42 AM | Updated on Oct 6 2026 12:42 AM

ద్వారకాతిరుమల: రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయం(శివాలయం)లో ఈ నెల 6 నుంచి 8 వరకు వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకం, వరుణ యాగం, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా ఈ పూజలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

కార్యక్రమాలు ఇలా..

● 6న ఉదయం 6.54 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభించి వరుణ జపాలు నిర్వహిస్తారు.

● 7న ఉదయం 8 గంటలకు మండప పూజలు, వరుణ జపాలతో పాటు వారుణ సువాక, శత సువాక, రుద్ర పారాయణలు నిర్వహిస్తారు.

● 8న ఉదయం 8 గంటలకు మూలవిరాట్‌కు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు వరుణ యాగం, హోమం, సాయంత్రం 4 గంటలకు మహా పూర్ణాహుతి, ఆశీర్వచనం కార్యక్రమాలు జరుపుతారు.

నేటి నుంచి మూడు రోజులపాటు కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement