●అమ్మతనానికి ప్రతిరూపం | - | Sakshi
Sakshi News home page

●అమ్మతనానికి ప్రతిరూపం

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

●అమ్మతనానికి ప్రతిరూపం

ఆకలి తీర్చే అన్నదానం గొప్పదైతే, చేతుల్లేని ఆపన్నుడికి అమ్మలా అన్నం తినిపించిన ఈ ఉద్యోగిని మాతృహృదయం అంతకంటే మిన్న. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం శనివారం వచ్చిన తాడేపల్లిగూడెంకు చెందిన ఉంగరాల సత్యనారాయణకు రెండు చేతులూ లేవు. అన్నప్రసాద భవనంలో అందరిలా తిన్లేక ఆయన పడుతున్న వేదనను గమనించిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని గాయత్రి తల్లడిల్లిపోయింది. వెంటనే అతడి చెంతకు చేరి, కన్నబిడ్డకు తినిపించినంత ఆప్యాయంగా స్వహస్తాలతో అన్నం తినిపించింది. ఆ క్షణంలో ఆమె చూపిన మాతృవాత్సల్యానికి సత్యనారాయణ కంటితడి పెట్టారు. ‘ ఆ స్వామివారే ఆమె రూపంలో వచ్చి నా ఆకలి తీర్చారు’ అని ఉద్వేగానికి లోనయ్యారు. దేవుడు గుడిలోని విగ్రహంలోనే కాదు.. తోటి మనిషి చూపే మానవత్వంలోనూ ఉంటాడని ఈ దృశ్యం నిరూపించింది.

– ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement