పోలవరం డీఎస్పీగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పోలవరం డీఎస్పీగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

పోలవరం డీఎస్పీగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

పోలవరం రూరల్‌: పోలవరం డీఎస్పీగా యు.రవిచంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్‌–డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు, పోలీసు శాఖకు మధ్య సత్సంబంధాలను పెంపొందించడం, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన నూతన డీఎస్పీ రవిచంద్రకు స్థానిక పోలీస్‌ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement