శరన్నవరాత్రులకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

శరన్నవరాత్రులకు ముస్తాబు

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయంగా, క్షేత్ర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ ద్వారాలు ముస్తాబు, ఇతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాలంకరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఉత్సవాల రోజుల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో ఉత్సవ విశేషాలను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శనివారం విలేకర్లకు వెల్లడించారు.

అలంకారాలు ఇవీ..

ఈనెల 11న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 12న శ్రీ గాయత్రీ దేవిగా, 13న శ్రీ అన్నపూర్ణా దేవిగా, 14న శ్రీ మహాచండీ దేవిగా, 15న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 16న శ్రీ సరస్వతీ దేవిగా(మూలానక్షత్రం), 17న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 18న శ్రీ దుర్గాదేవిగా (దుర్గాష్టమి), 19న శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా, 20న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా(విజయదశమి) భక్తులను కటాక్షిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి క్షేత్రంలో అమ్మవారి రథోత్సవం, 21న దీక్షాదారుల ఇరుముడి సమర్పణ, చండీ హోమాన్ని నిర్వహిస్తామన్నారు. 22న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన జరుపుతామన్నారు. భక్తులు ఈ వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొనాలని ఈఓ కోరారు.

ఈనెల 11 నుంచి ఉత్సవాలు

రోజుకో అలంకారంలో క్షేత్రదేవత కుంకుళ్లమ్మ దర్శనం

ఉత్సవ వివరాలను వెల్లడించిన ఆలయ ఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement