ఫారెస్ట్‌ భూముల ఆక్రమణలకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్‌ భూముల ఆక్రమణలకు యత్నం

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

చాట్రాయి: మండలంలోని పోలవరం ఫారెస్ట్‌ భూములలో శనివారం పేదలు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఆర్‌ఎస్‌ నంబర్‌ 1 పరిధిలో పోతనపల్లి, పోలవరం గ్రామాలకు చెందిన 300 మంది పేదలు ఆక్రమణలకు యత్నించగా, ఫారెస్ట్‌ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు, స్థానిక టీడీపీ నాయకుడు మరిడి చిట్టిబాబుకు, ఫారెస్ట్‌ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ‘ఇటీవల ఆక్రమణలు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మేము ఆక్రమించుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?‘ అని ఆక్రమణదారులు అధికారులను నిలదీశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై డి.రామకృష్ణ, డీఆర్వో సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణదారులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఆక్రమణలకు అధికారులు లంచాలు తీసుకున్నారని ఈ సందర్భంగా పేదలు ఆరోపించారు. ఫారెస్ట్‌ భూములను ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి, బోర్లు తవ్వి పంటలు పండించుకుంటున్న వారి వద్ద నుంచి ఫారెస్ట్‌ అధికారులు వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని వారు మండిపడ్డారు. పాత ఆక్రమణలను తొలగించకపోతే తాము కూడా అటవీ భూములను ఆక్రమించుకుంటామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్‌ ద్వారా డీఆర్వో సత్యనారాయణతో మాట్లాడారు. గతంలో జరిగిన ఆక్రమణలను 10 రోజుల్లోగా తొలగించాలని ఫారెస్ట్‌ అధికారులను ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement