వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కై కలూరు : సమాజంలో గాంధేయ మార్గమే శ్రీరామరక్ష అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాసీ్త్రల జయంతి సందర్భంగా కై కలూరు గాంధీబొమ్మ వద్ద శుక్రవారం నివాళులర్పించారు. డీఎన్నార్ మాట్లాడుతూ అహింస మార్గంతో బ్రిటీష్ ప్రభుత్వాన్ని గాంధీజీ గడగడలాడించారన్నారు. ఆయన బోధనలు, ఆశయాలను అందరూ తప్పక పాటించాలన్నారు. అ నంతరం ప్రజలకు స్వీట్లు పంపిణి చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు శింగంశెట్టి రాము, ఉపాధ్యక్షుడు పి.అనిల్‌కుమార్, రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ ఎండీ గాలీబ్‌బాబు, జిల్లా ఎంప్లాయర్స్, పెన్షనర్ల విభాగ అధ్యక్షుడు ఎలుగుల వేణుగోపాలరావు, జిల్లా అర్గనైజింగ్ సెక్రటరీ జయమంగళ కాసులు, టౌన్ అధ్యక్షుడు సమయం అంజి, నాయకులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: చిన వెంకన్న కొండపై ఓ కాంట్రాక్టర్‌కు అనధికారికంగా రెండు రోజులపాటు ఉచితంగా కాటేజీని కేటాయించిన వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో దేవస్థానం అధికారులు స్పందించారు. కాటేజీ అద్దె రూ.6,574ను సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా శుక్రవారం ఉదయం దేవస్థానం ఖజానాకు జమ చేయించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కాంట్రాక్టర్ ఎట్టకేలకు నగదు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అమరావతికి చెందిన సెవెన్‌న్‌హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ శ్రీనివాస నిలయం గెస్ట్‌హౌస్‌లో ఉచితంగా బస చేసిన విషయం తెలిసిందే.
తాడేపల్లిగూడెం : అంతర్ జిల్లా నేరస్తుడిని తాడేపల్లిగూడెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఉభయ గోదావరితో పాటు బాపట్ల, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాలో 37 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పెదకాకాని పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాడేపల్లిగూడెంలో కారు చోరీ కేసులు అడ్డంగా బుక్కయ్యాడు. డీఎస్పీ బి.నరసింహారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కరుటూరి సూర్యతేజ ఈనెల 27న రాత్రి పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్‌లో ప్రవేశించి కా రును, నగదు, సీసీ టీవీ డీవీఆర్‌ను అపహరించా డు. ఈ మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ బోఽణం ఆదిప్రసాద్ బృందం దర్యాప్తు చేపట్టి ఉంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై పెద్దాపురం, ఒంగోలులో చేసిన షట్టర్ పగులగొట్టి చేసిన చోరీలు బయటకు వచ్చాయి. తాడేపల్లిగూడెంలో నమోదైన కేసుకు సంబంధించి కారు, పెద్దాపురంలో కేసుకు సంబంధించి రూ.1,63,581, ఒంగోలులో కేసుకు సంబంధించి రూ.36 వేల నగదు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కారు విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందన్నారు.
పాలకోడేరు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పాలకోడేరు పీఎంసీ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఎస్‌కే ధరణి ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లా ప్రాతినిధ్యం వహిస్తాడని కోచ్ వనుం వెంకటేష్ తెలిపారు. ధరణి స్వగ్రామం మోగల్లు. గ్రామస్తులు అతడిని అభినందించారు.


