గళమెత్తినఅంగన్‌వాడీలు | - | Sakshi
Sakshi News home page

గళమెత్తినఅంగన్‌వాడీలు

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తమకు వేతనాలు పెంచుతామనే హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేయడంపై అంగన్‌వాడీలు గళమెత్తారు. ఏలూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యాలయం అల్లూరు సత్యనారాయణ భవనం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గాంధీజీ విగ్రహానికి అందజేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడేళ్లుగా అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు పలు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో మిగిలిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్‌లుగా మార్పు చేయాలని తదితర సమస్యలను ప్రస్తావించారు. ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement