జాతీయ పెంటాథ్లాన్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ పెంటాథ్లాన్‌ పోటీలకు ఎంపిక

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

జాతీయ పెంటాథ్లాన్‌ పోటీలకు ఎంపిక ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ సేవా సంకల్ప అభియాన్‌ వికసిత్‌ భారత్‌ పోటీలు సహస్ర గళం.. పారాయణ వైభవం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జాతీయ పెంటాథ్లాన్‌ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మోడ్రన్‌ పెంటాథ్లాన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గత జూలై 10 నుంచి 12వ తేదీ వరకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో లేజర్‌ రన్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన వారిలో సీనియర్‌ విభాగంలో జిల్లాకు చెందిన కే అప్పారావు, డీ నాగ మోహనరెడ్డి, కే వాట్సన్‌ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని సత్యనారాయణ పేర్కొన్నారు.

ముదినేపల్లి రూరల్‌: మండలంలోని గురజలో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుకవైపు తాళాలు పగులగొట్టి వెండి వస్తువులు, నగదు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ముప్పిడి ధనుంజయ అనారోగ్యానికి గురికావడంతో తన భార్యతో కలిసి గతనెల 25న చికిత్స నిమిత్తం విజయవాడ వెళ్లారు. వెళ్లేటప్పుడు ఇంటిని గమనిస్తూ ఉండాలని ధనుంజయ తన సోదరుడు ఉదయ్‌కుమార్‌కు చెప్పి వెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఉదయ్‌కుమార్‌ ఇంటిని పరిశీలించగా, వెనుకవైపు ఉన్న తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, గుర్తుతెలియని వ్యక్తి లోపలికి చొరబడి 300 గ్రాముల బరువున్న వెండి వస్తువులతోపాటు రూ. 15 వేల నగదు దొంగిలించినట్లు తేలింది. దీనిపై ఉదయ్‌కుమార్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం: స్థానిక ఏఆర్‌కేఆర్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి ‘సేవా సంకల్ప అభియాన్‌ – వికసిత్‌ భారత్‌’ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి ఎన్‌.రమేష్‌ మాట్లాడుతూ చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో మండల స్థాయిలో విజేతలైన 138 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో చిత్రలేఖనం జూనియర్స్‌ విభాగంలో జి.దేవవర్షిని ప్రథమ స్థానంలో, టి. సాయిప్రియ ద్వితీయ స్థానంలో, ఎ.సొలోమి తృతీయ స్థానంలో నిలిచారు. చిత్రలేఖనం సీనియర్స్‌ విభాగంలో ఎ.మంగ ప్రథమ, ఎ.పూర్ణశ్రీమంగ ద్వితీయ, వి.సుస్మిత తృతీయ స్థానాలు సాధించారు. అలాగే, వక్తృత్వం జూనియర్స్‌ విభాగంలో ఎ.ఉమామహేశ్వరి ప్రథమ, వి. గీతిక ద్వితీయ, ఎం.జస్వంత్‌ సత్య తృతీయ స్థానాల్లో గెలుపొందారు. సీనియర్స్‌ విభాగంలో ఎన్‌.షర్మిల, పి.రమాదేవి, వి.దశ పూర్ణిమ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించగా, జూనియర్‌ కళాశాల విభాగంలో జి.మమత, ఎన్‌.మహిమ రాజు, జి.భానుశ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజయం సాధించారు. విజేతలైన విద్యార్థులంతా అక్టోబర్‌ 9వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు రమేష్‌ వెల్లడించారు.

పాలకొల్లు సెంట్రల్‌: మహిళా సాధికారత, యువజన సాధికారత, సంతోషకరమైన కుటుంబాల నిర్మాణం, ఆనందదాయకమైన వృద్ధాప్యం ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రేమతో కూడిన ప్రపంచం ఏర్పడుతుందని కామాఖ్యామృత పీఠం హైదరాబాద్‌ శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ (మణిప్రసన్నమ్మ) అన్నారు. గురువారం పట్టణంలోని బ్రాడీపేట బైపాస్‌ రోడ్డులో ఉన్న ఎస్‌. కన్వెన్షన్‌ హాలులో సనాతన భక్తిమండలి, శ్రీ విద్యా ఉపాసకురాలు డాక్టర్‌ నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సహస్రగళ లలితా పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు 2,500 మంది మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా లలితా సహస్రనామ పారాయణ విశిష్టతను వేణుశ్యామ వివరించారు. భక్తులకు ఉచ్చరణ దోషాలు లేకుండా సరైన పద విభజనతో మూడు పర్యాయాలు పారాయణం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement