విలువైన ప్రాణాలు కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

విలువైన ప్రాణాలు కాపాడుకుందాం

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

ఏలూరు టౌన్‌ : రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆదుకుని వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది కేవలం చూస్తూ ఉండిపోతున్నారే తప్ప సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందనో, కేసుల్లో ఇరుక్కుంటామనో, లేదా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందనే భయంతో ప్రజలు వెనకడుగు వేస్తుంటారని తెలిపారు. అయితే, 108 అంబులెన్స్‌ వచ్చేలోపు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స, సీపీఆర్‌ వంటి అత్యవసర సేవలు అందిస్తే వారి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని వివరించారు.రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించి ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించే వారికి ప్రభుత్వం రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకు ఆర్థిక ప్రోత్సాహక బహుమతి అందజేస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రాణాలు రక్షించిన సామాన్యులను ప్రభుత్వం ‘గుడ్‌ సమారిటన్‌ అవార్డు’తో ఘనంగా సత్కరిస్తుందని తెలిపారు. ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయం చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తులను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరని, వారికి చట్టపరంగా పూర్తి రక్షణ ఉంటుందని భరోసా కల్పించారు. భయాన్ని విడిచిపెట్టి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని, విలువైన ప్రాణాలను రక్షించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎస్పీ శివకిషోర్‌ కోరారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement