సమగ్ర పోషక యాజమాన్యంపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సమగ్ర పోషక యాజమాన్యంపై శిక్షణ

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

సమగ్ర పోషక యాజమాన్యంపై శిక్షణ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏలూరు ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు సమగ్ర పోషక యాజమాన్యంపై 15 రోజుల సర్టిఫికెట్‌ కోర్సు నిర్వహిస్తున్నట్లు ఏరువాక కేంద్రం సమన్వయకర్త కే ఫణికుమార్‌ తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త ఎన్‌. నాగేంద్రబాబు సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్‌ హబీబ్‌ బాషా, ఆత్మ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఉషాదేవి, ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కే సాజానాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫణికుమార్‌ మాట్లాడుతూ.. సభ్యులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటల ఉత్పాదకతను స్థిరంగా కొనసాగించేందుకు సేంద్రియ, రసాయన ఎరువులను సమతుల్యంగా వినియోగించడం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం అవసరమని వివరించారు. రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, కోఆర్డినేటర్‌ ఎం. శ్రీనివాస్‌ నేల సారవంతత భావన, నేల ఆరోగ్యంలో సేంద్రియ ఎరువుల పాత్ర, అధిక మోతాదులో రసాయన ఎరువుల వినియోగం వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావాలు, సేంద్రియ ఎరువుల వనరులపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement