ఎవ్వరూ భయపడొద్దు
న్యూస్‌రీల్
కార్పొరేషన్‌లో అవినీతి
ఆదరిద్దాం... అభయమిద్దాం
వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిదీ. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు అటవీశాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. 8లో u
చంద్రబాబు అంటే అమ్మకం
గోదావరి వరదలతో విలీన మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్క దశలోనే ముంపు చుట్టుముట్టేసింది.
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఏలూరు టౌన్: ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం’ అనే నినాదంతో స్థానిక ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) అధ్యక్షతన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఏలూరు పరిశీలకుడు డీవీఆర్‌కే చౌదరి తదితరులు హాజరయ్యారు. పార్టీ సభ్యత తొలి గుర్తింపు కార్డును సమన్వయకర్త జేపీకి అందజేశారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రోజులు గడుస్తున్న కొద్దీ.. టీడీపీ కూటమి అధికారానికి దూరం అవుతుంటే.. వైఎస్సార్‌సీపీ అధికారానికి చేరువు అవుతోందనీ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ప్రతి కార్యకర్త, నాయకుడు శక్తివంచన లేకుండా విజయానికి సైనికుల్లా పనిచేయాలని అన్నారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు, మట్టి, ఇసుక, మద్యం, డీఎస్సీ టీచర్ పోస్టులు సైతం అమ్ముకున్నారనీ, ఆఖరికి ఉత్తరాంధ్రలో షుగర్ ఫ్యాక్టరీలను అమ్మకానికి పెట్టిన ఘ నుడు చంద్రబాబు అన్నారు. రూ.2,500 కోట్లకు అమ్ముకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకానికి బ్రాండ్‌గా నిలుస్తారనీ... 17 మెడికల్ కళాశాలలు, 3 పోర్టులు, 15 వేల సచివాలయాలు, 15 వేల రైతు భరోసాకేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, 12 వేలకు పైగా పాఠశాలల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టు ఇలా అనేక అభివృద్ధి పనులు చేసి చూపించిన గొప్ప ప్రజానాయకుడు అని కొనియాడారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు గేదెల సూర్యప్రకాష్, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాస్, నాయకులు భాస్కర్ల బాచి, రాజేష్, మోటమర్రి సదానందకుమార్, కొల్లిపాక సురేష్, జయకర్, లూటుకుర్తు సుభాష్, ప్రత్తిపాటి తంబి, ఇనపనూరి కేదారేశ్వరి, గ్జేవియర్ మాస్టర్, జక్కుల బెనర్జీ, జగదీష్, కిలాడి దుర్గారావు, గంటా రాజేశ్వరరావు, గంటా సాయిప్రదీప్, యుగంధర్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, 2027 సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని అమర్నాథ్ అన్నారు. జగన్ పాదయాత్రతో వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందనీ.. టీడీపీ కూటమి పార్టీల అంతిమయాత్రగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలను గుర్తు చేయాలనీ, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఏలా మోసం చేశారో అవగాహన కల్పించాలని చెప్పారు. బియ్యం 25 కిలోలు రూ.1200 ఉంటే నేడు రూ.1,800లకు చేరిందనీ, పంచదార ఏకంగా రూ.70లకు ఎగబాకిందనీ, ఉల్లిపాయ కొనాలంటేనే కన్నీరు వస్తుందని ఎద్దేవా చేశారు. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయన్సెర్లకు డబ్బులు ఇస్తామనీ టీడీపీ చెబుతుందనీ, కూటమి తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా డబ్బులు ఇస్తారా ? అంటూ ప్రశ్నించారు. కేవలం టీడీపీ సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రజాధనం దోచి పెట్టేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటు న్నారని విమర్శించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క సీటూ ఏకగ్రీవం కావటానికి వీల్లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. అన్నింటికీ గట్టి పోటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ప్రభుత్వం అవినీతి అధికారులకు కొమ్ము కాస్తూ, ప్రజాధనం దోపిడీపై చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరించటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
విజయమే లక్ష్యం
స్థానిక పోరులో ఐక్యంగా కృషి చేద్దాం
ఒక్కచోటా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు
రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. అంతా అవినీతే
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్
ఏలూరులో ఎన్నికల సన్నాహక సమావేశం


