అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు మందుబాబులకు చెక్‌ గంజాయి కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు వ్యవసాయ పాలిటెక్నిక్‌తో ఉపాధి మెండు

ఏలూరు టౌన్‌: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల చేతిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త కిరణ్‌ను పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పరామర్శించారు. నగరంలోని ఆంధ్ర హాస్పిటల్‌కు వెళ్లిబాధితుడు కిరణ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలంతా అండగా ఉంటారని భరోసా కల్పించారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకపాలనపై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామనీ, ధైర్యంగా ఉండాలని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్‌ చౌదరి, జి ల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, మాజీ జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం తదితరులు ఉన్నారు.

కైకలూరు : పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (165) విస్తరణ పనుల్లో గోపవరం–అగ్రహారం బైపాస్‌ రోడ్డులో తాగుబోతులకు కై కలూరు టౌన్‌ పోలీసులు బుధవారం చెక్‌ పెట్టారు. ఇక్కడ సమస్యపై ‘ప్రారంభానికి ముందే తాగుబోతుల రహదారి’ శీర్షికన గతనెల 22న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించారు. సీఐ ఏవీఎస్‌ రామకృష్ణ ఆదేశాలతో ఎస్సై కె.గణేష్‌ వర్మ నిఘాను ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి హైవే బైపాస్‌లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారితోనే ఉదయం బైపాస్‌ సమీపంలో తాగి పడేసిన మద్య సీసాలను సంచులతో ఎత్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని, ఇక్కడ ప్రతిరోజూ నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

ఏలూరు టౌన్‌: గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికీ ఐదేళ్ల జైలు, రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఎన్‌డీపీఎస్‌ కేసుల విచారణ, మొదటి అదనపు జిల్లా జడ్జి, ప్రత్యేక న్యాయమూర్తి యు.ఇందిరా ప్రియదర్శిని తీర్పు చెప్పారు. 2.400 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో బుధవారం తుది తీర్పు వెలువరించారు. వివరాలిలా ఉన్నాయి.. 2022లో జంగారెడ్డిగూడెంలో పారిజాతగిరి ద్వారం సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా మోటారు సైకిల్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన తుంపల సాయి, తణుకు సంగీత్‌ అలియాస్‌ గిటార్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. అప్పటి సీఐ బాలసురేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చే పట్టారు. సీఐ బాలసురేష్‌బాబు, ఎస్సై ఎం.సాగర్‌బాబు సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టగా, స్పెషల్‌ పీపీ శారదమణి, స్పెషల్‌ పీపీ సంధ్య వాదనలు వినిపించారు.

పెనుమంట్ర: దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా 2004లో 75 వసంతాల ఉత్సవం జరుపుకున్న ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో నేడు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన పాలిటెక్నిక్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ ఎందరో పేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే ఉన్నత విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనతను దక్కించుకుందన్నారు. కళాశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. మరో ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement