జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

రూ.5 లక్షల ప్రమాద బీమాపై హర్షం

బుట్టాయగూడెం : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమాపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై ఏజెన్సీ ప్రాంతంలోని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి బుట్టాయగూడెం పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరు శివరామరాజు ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రమాదవశాత్తూ కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటుచేశారన్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికీ ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పార్టీ మండల కన్వీనర్‌ అల్లూరి రత్నాజీరావు, జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్‌ బాజీ, గగ్గులోతు మోహన్‌రావు, గంటసాల గాంధీ, బానోతు కృష్ణనాయక్‌, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement