జంగారెడ్డిగూడెం(చింతలపూడి)/వేలేరుపాడు: తమ సమస్యలు పరిష్కరించి, జీవనోపాధి కల్పించి ఆదుకోండంటూ పోలవరం నిర్వాసితులు కలెక్టర్ కె.వెట్రిసెల్వికి విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడవాయి పంచాయతీ పరిధిలోని ఆర్ అండ్‌ఆర్ కాలనీ (చల్లవారిగూడెం)లో బుధవారం ఆమె పర్యటించగా.. నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 2022 నుంచి వేలేరుపాడు, పోలవరం, కుక్కునూరు, వీఆర్ పురం మండలాలకు చెందిన సుమారు 800 కుటుంబాలు ఇక్కడ ని వాసం ఉంటున్నాయని, కాలనీలో తాగునీరు, వి ద్యుత్ సమస్యలతో పాటు ఇళ్ల స్లాబ్‌ల లీకేజీలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మహిళలు, యు వకులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసి స్వ యం ఉపాధికి ప్రోత్సహించాలని కోరారు. అధికారుల పొరపాట్ల వల్ల అనర్హులుగా మిగిలిన వారికి తక్షణమే ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందించాలని, గ్రామసభలు నిర్వహించి నిర్వాసితులను గుర్తిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం వ్యక్తి ఖాతాలోకి నష్టపరిహారం!
నడిమిగొమ్ము కాలనీకి చెందిన తనకు రావాల్సిన రూ.6.86 లక్షల పరిహారం అధికారుల తప్పిదం వల్ల శ్రీకాకుళంలో ఉన్న మరో వ్యక్తి ఖాతాలో పడిందని బాధితుడు కాపుల లాలయ్య కుటుంబం కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నిర్వాసిత కమిటీ నాయకులు బద్దె ప్రేమ్‌కుమార్, పెరుమాళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


