నేను పది ఎకరాల్లో మిర్చి పంటను వేశాను. ప్రస్తుతం గోదావరి వరద ముంచెత్తడంతో సుమారు ఐదు ఎకరాల వరకు పంట వరద నీటిలో మునిగింది. ప్రతి ఏటా వరదతో ఇబ్బంది పడుతూ పెట్టుబడులు నష్టపోతున్నాం.
– ఇల్లా సురేష్, బెస్తగూడెం, కుకునూరు మండలం
గోదావరి వరద కారణంగా నా పంట ఐదెకరాల్లో మునిగింది. ఏటా ఇలానే ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాస కాలనీకి తరలించాలి, లేదా పంట నష్టపరిహారం ఇప్పించాలి.
– కోమల్ల బ్రహ్మచారి, బెస్తగూడెం, కుకునూరు మండలం


