అండర్‌ 19 బాలికల జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అండర్‌ 19 బాలికల జిల్లా జట్ల ఎంపిక

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

అండర్‌ 19 బాలికల జిల్లా జట్ల ఎంపిక అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలకు పద్మాలు జాతీయస్థాయి పోటీలకు బయ్యన్నగూడెం విద్యార్థులు

తణుకు అర్బన్‌: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్‌ కళాశాలలో బుధవారం అండర్‌–19 బాలికల జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో యోగా, ఖోఖో, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. వీరిలో 50 మంది క్రీడాకారిణులు జిల్లా జట్టుకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఎంపికై న వారిలో 8 మంది తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులే ఉండటం విశేషమని ఆమె వివరించారు.

భీమవరం : గ్రీస్‌లో వచ్చే నెలలో నిర్వహించే 80 ప్లస్‌ విభాగం అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలలో పాల్గొంటున్న భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌ వ్యవస్థాపక కార్యదర్శి తటవర్తి పద్మనాభరావును (పద్మాలు) బుధవారం ఆ క్లబ్‌ ఆధ్వర్యంలో సత్కరించారు. 80 ప్లస్‌ వయస్సు విభాగంలోని అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీలలో భారతదేశానికి పద్మనాభరావు ప్రాతినిధ్యం వహించడం జిల్లాకే గర్వకారణమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి భూపతిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షుడు వేగేశ్న రమేష్‌, తటవర్తి రాజు, ముదునూరి గోపాలకృష్ణంరాజు, సురేష్‌బాబు, కొత్తపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం : జాతీయస్థాయి రోప్‌ జంప్‌ పోటీలకు తమ హైస్కూల్‌కి చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు బయ్యన్నగూడెం జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం కె.రవికుమార్‌ బుధవారం తెలిపారు. సెప్టెంబర్‌ 27, 28 తేదీలలో అన్నమయ్య జిల్లా పీలేరులో రాష్ట్రస్థాయి రోప్‌ జంప్‌ పోటీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో బయ్యన్నగూడెం నుంచి అండర్‌–14 విభాగంలో 12 మంది విద్యార్థులు పాల్గొనగా, 9వ తరగతి అభ్యసిస్తున్న ఎం.సంజయ్‌, బి.హారిక, ఎ.భార్గవి, పి.యామిని, టి.రేష్మ, డి.సంజన ప్రతిభ కనబరిచారు. వీరు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్‌ 9, 10, 11 తేదీలలో మహారాష్ట్రలోని నాందేడ్‌ పట్టణంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు బి.రవికుమార్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఆళ్ల వెంకటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement