అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పర్యటన

Oct 1 2026 4:34 AM | Updated on Oct 1 2026 4:34 AM

పెదవేగి: ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు, వివిధ రకాల పంటలు, సాగు మోడళ్లను అధ్యయనం చేయడానికి ఇండోనేషియాకు చెందిన ‘ఆస్టుంగ్‌కారావే ఆర్గనైజేషన్‌’ నుంచి 9 మంది సభ్యులు, థాయిలాండ్‌కు చెందిన ‘బోర్డర్‌లెస్‌ ఫౌండేషన్‌’ నుంచి ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించింది. బుధవారం ఈ ప్రతినిధుల బృందం మండలంలోని గోకినేపల్లి గ్రామాన్ని సందర్శించింది. అక్కడ ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి. వెంకటేష్‌ తన సొంత పొలంలో పండిస్తున్న ఐదు రకాల దేశీ వరి వంగడాలను చూపిస్తూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేస్తున్న విధానాన్ని వివరించారు. అలాగే, కొప్పాకగూడెం గ్రామానికి చెందిన రైతు కళా చంద్రరావు పండిస్తున్న కూరగాయల సాగు మోడల్‌ను కూడా వారు పరిశీలించారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్‌ హబీబ్‌ బాషా జిల్లాలో అమలవుతున్న వ్యవసాయ విధానాలు, ప్రకృతి వ్యవసాయ విస్తరణ గురించి వివరించి వారితో చర్చించారు. తదనంతరం, పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామంలో రైతు రంగయ్య నిర్వహిస్తున్న 5–లేయరు (ఐదు అంచెల) ఉద్యానవన పంటల నమూనా ఫీల్డ్‌ను బృందం సందర్శించింది. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి. వెంకటేష్‌, అడిషనల్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజరు షేక్‌ మహబూబ్‌ వలీ, నవీన, పద్మనాభం తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement