బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పీఎంపీ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పీఎంపీ అరెస్ట్‌

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పీఎంపీ అరెస్ట్‌ బడిలో చేరిన చిన్నారులు

నిడమర్రు: వైద్యం కోసం వచ్చిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుపై నిందితుడైన పీఎంపీ వైద్యుడు అడపా సత్యనారాయణను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నక్కా రజనీకుమార్‌, ఎస్సై లంక రాజేష్‌ తెలిపారు. నిడమర్రు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ సదరు పీఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో అతను బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి వాగ్మూలం, అవసరమైన ఆధారాలు సేకరించి, దర్యాప్తులో లభించిన నిరూపణల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు వారు వెల్లడించారు.

ఆన్‌లైన్‌ చిత్రలేఖన పోటీల విజేతలు వీరే

భీమవరం: గాంధీ జయంతిని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ చిత్రలేఖన పోటీల విజేతల వివరాలను మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు పత్రికలకు విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమమగోదావరి జిల్లా స్థాయిలో విద్యార్థులకు ‘మహాత్మాగాంధీ సత్యం, అహింస విధానాలు నేటి పరిస్థితులు’ అనేక అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వీటిలో 21 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయగా విజేతలకు అక్టోబర్‌ 2న పెదనిండ్రకొలనులోని మహాత్మాగాంధీ భవనంలో బహుమతులు అందజేస్తామని చెప్పారు.

పాఠశాల స్ధాయి విజేతల వివరాలు

జి దేవవర్షిణి (అనాకోడేరు), ఎస్‌ చాన్‌బాబు (జీలకర్రగూడెం), పి జయశ్రీ (వట్లూరు), జి.ప్రీతిక (భీమవరం), కె.ప్రవల్లిక (మేడపాడు), జి.అర్చన (కామవరపుకోట), కె.గాయత్రి (పెనుమంట్ర), జె.సంయుక్త (తాడేపల్లిగూడెం), ఎస్‌.లూధర్‌ (దర్శిపర్రు), కె.చంద్రిక (పెదనిండ్రకొలను), బి.షైనీ (ఆకివీడు), కె.స్నేహ (పాలకోడేరు), సీహెచ్‌ దీవెన (పత్తేపురం), ఆర్‌.చరణతేజ (చినఅమిరం), పి సాయిలక్ష్మి (బలుసుమూడి), కె.లహరి (పెదఅమిరం).

కళాశాల స్థాయి విజేతల వివరాలు

జి.భానుశ్రీ (పెన్నాడ), కె.షణ్ముక్‌ (ఏలూరు), వి.మీరాసహస్ర (తాడేపల్లిగూడెం), కె లీలాప్రసన్న (తణుకు), బి.వెంకటలక్ష్మి (భీమవరం).

పెంటపాడు: గూడెంలో చెత్త ఏరుకుంటున్న ఇద్దరు చిన్నారులను సోమవారం పరిమెళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఎంఈవో ఎం.శ్రీనివాస్‌ చేర్పించారు. కలెక్టర్‌ నాగరాణి, డీఈవో అనిల్‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి రాజేష్‌ ఆధ్వర్యంలో పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement