చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీ సువర్చలా సమేత హనుమద్ కల్యాణం ఘనంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన వెల్లడించారు.


