14.20 లక్షల క్యూసెక్కులు దిగువకు.. | - | Sakshi
Sakshi News home page

14.20 లక్షల క్యూసెక్కులు దిగువకు..

Aug 3 2026 12:49 AM | Updated on Aug 3 2026 12:49 AM

14.20 లక్షల క్యూసెక్కులు దిగువకు.. గిరిజనుడి మృతదేహం లభ్యం నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ రాట్నాలమ్మా.. నమోనమః భక్తుడికి తీవ్ర అస్వస్థత డీఎస్సీపై విచారణ జరిపించాలి

పోలవరం రూరల్‌: పోలవరంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. దిగువన స్పిల్‌వే వద్ద 34.550 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్‌వే నుంచి 14.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం కొనసాగుతోంది. పట్టిసం శివక్షేత్రం వద్ద మెట్లను తాకుతూ వరద ప్రవాహిస్తోంది. శివక్షేత్రానికి చేరుకునే లాంచీలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే పోలవరం, పురుషోత్తపట్నానికి లాంచీని నిలిపివేశారు. పట్టిసం ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ దిగువ వరకు వరద నీరు చేరింది. అలాగే పోలవరంలో కడెమ్మ స్లూయిజ్‌ వద్ద గేట్లు ముంపు బారిన పడ్డాయి. స్పిల్‌వే దిగువన లంక ఒడ్డులను తాకుతూ వరద ప్రవాహిస్తోంది.

వేలేరుపాడు : ఎద్దెలవాగు వద్ద శుక్రవారం రాత్రి గోదావరి వరద లో గల్లంతైన నూపా ప్రసాద్‌ (35) మృతదేహం ఆదివారం లభించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గ్రామస్తులు మూడు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపట్టగా ఎడవల్లి సమీపంలోని గోదావరిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని అక్కడి నుంచి ట్రాక్టర్‌పై తరలించి నార్లవారం కాలనీ పంపు వద్ద పడవపై దాటించారు. అనంతరం వాహనంపై జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం వేలేరుపాడు ఎస్సై నవీన్‌ తరలించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం ఏలూరు కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్‌సైట్‌, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.

పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పలు రూపాల్లో ఆలయానికి రూ.82,175 ఆదాయం సమకూరినట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఈఓ నల్లూరి సతీష్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనార్థం ఆ దివారం ఉదయం క్షేత్రానికి విచ్చేసిన ఓ వృద్ధ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. దేవస్థానం సిబ్బంది వెంటనే పీహెచ్‌సీకి తరలించా రు. వివరాలిలా ఉన్నాయి.. తణుకుకు చెందిన కె.సూర్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి క్షేత్రానికి వచ్చారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే దేవస్థానం ఆంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అక్కడ ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

వీరవాసరం: డీఎస్సీ–2025లో జరిగిన పేపర్‌ లీకేజీ, అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నౌడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement