ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరిన ఓ భక్తుడి కుటుంబానికి కొండపైన ఘాట్ రోడ్డులో ప్రమాదం ఎదురైంది. ప్రమాదకర మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో చిన్నారులతో సహా, తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం గుడివాడకు చెందిన తమ్మిశెట్టి అశోక్‌కుమార్ తన కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి, రేవతి, చాణిక్య, భానుచందు, దుర్గ, దివ్యశ్రీవల్లి, మోక్షిత, మరో బాలుడితో సహా ఆటోలో ద్వారకాతిరుమలకు వచ్చారు. స్వామి దర్శనానంతరం అదే ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. శివాలయం ఘాట్ రోడ్డు లోంచి కొండ దిగుతుండగా ఓ మలుపు వద్ద ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ ఎం.ఏసు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందించారు.
ధ్వంసమైన ఆటో
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
తొమ్మిది మంది భక్తులకు గాయాలు


