స్పందన | - | Sakshi
Sakshi News home page

స్పందన

Aug 3 2026 12:49 AM | Updated on Aug 3 2026 12:49 AM

ఎట్టకేలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు చికెన్‌

నూజివీడు : నెల రోజులుగా చికెన్‌, గుడ్డుకు దూరమైన నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు ఎట్టకేలకు చికెన్‌ అందింది. విద్యార్థులకు ఆదివారం చికెన్‌తో భోజనం పెట్టారు. చికెన్‌, గుడ్డు అందించకపోవడంతో పోషకాహారం దూరమైందని ‘సాక్షి’లో గత నెల 17న, 27న వరుసగా కథనాలు ప్రచురించింది. దీంతో యూనివర్సిటీ అధికారులు పలు రకాలుగా ప్రయత్నించి చివరకు గతేడాది మాదిరిగా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. దీంతో విద్యార్థులకు ఒక్కొక్కరికి పులుసుతో కలిసి 150 గ్రాముల చికెన్‌ను భోజనంలో వడ్డించారు. ఇలా సుమా రు 8 వేల మందికి అందించారు. ఏఓ బి. లక్ష్మణరావు పరిశీలించారు. ‘సాక్షి’కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement