మద్దిలో ముగిసిన వరుణ జపాలు | - | Sakshi
Sakshi News home page

మద్దిలో ముగిసిన వరుణ జపాలు

Aug 2 2026 12:58 AM | Updated on Aug 2 2026 12:58 AM

మద్దిలో ముగిసిన వరుణ జపాలు బాలికకు వేధింపులు.. నిందితుడి అరెస్ట్‌ అక్రమ తవ్వకాలపై చర్యలేవి? తల్లిపాల వారోత్సవాలు బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో వర్షాభావ నివృత్తి కోసం చేపట్టిన వరుణ జపాలు, వరుణ హోమాలు మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్‌ కమి షనర్‌, కార్యనిర్వహణాధికారి ఆర్‌వీ చందన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధర్మకర్తలు పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: బాలికను సోషల్‌ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిని ఏలూరు వన్‌టౌన్‌ సీఐ కె.రామకృష్ణ చాకచక్యంగా అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్‌ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవటంతో ఆమె సోషల్‌ మీడియా ఖాతాను బ్లాక్‌లో పెట్టింది. దీంతో ద్వేషం పెంచుకున్న సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లాకు చెందిన పరంపోగు విల్సన్‌బాబు అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్‌ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. సోషల్‌ మీడి యా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపారు.

కొయ్యలగూడెం: అవినీతి, అక్రమాలు సాక్షాధారాలతో సహా అధికారుల ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి శ్రేణులు ధర్నా నిర్వహించడం శనివారం చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు వాడపల్లి రమేష్‌ మాట్లాడుతూ రాజవరం పంచాయతీ గంగవరం మెట్టగా పిలవబడే ప్రాంతంలో రెండు నెలల కాలంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిగాయన్నారు. ముఖ్యంగా సర్వే నం.207లో చేసిన తవ్వకాల వలన పొట్టి కొండగా పిలవబడే ప్రాంతం కనుమరుగై పర్యావరణం పాడైందన్నారు. అక్రమ తోలకాలు చేసిన వ్యక్తులపై చర్యలు, డంప్‌ చేసిన గ్రావెల్‌, మట్టిని సీజ్‌ చేసి ప్రభుత్వానికి అందాల్సిన సొమ్మును రాబట్టాలని డిమాండ్‌ చేశారు. జనసేన, టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన శ్రేణులు పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆస్పత్రి ఎంసీహెచ్‌ బ్లాక్‌లో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లులకు తల్లిపాల విశిష్టతను వివరించారు. బిడ్డకు తల్లిపాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. డీఐవో పుల్లయ్య, పిడియాట్రిక్‌ హెచ్‌ఓడీ సుజాతదేవి, గైనిక్‌ ఇన్‌చార్జి హెచ్‌ఓడీ విజయలక్ష్మి, పీపీ యూనిట్‌ డాక్టర్‌ కె.ఆనంద్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: సైన్స్‌ ఉపాధ్యాయులు విద్యార్థులతో సైన్స్‌ ప్రాజెక్టులు తయారు చేయించి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని డీఈఓ ఈ. నారాయణ పిలుపునిచ్చారు. 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. 10 నుంచి 17 ఏళ్ల వ యసున్న పిల్లలో ప్రాజెక్టులు తయారు చేయించాలన్నారు. అప్కాస్ట్‌ జిల్లా సమన్వయ అధి కారి మల్లుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ 15లోపు ప్రాజెక్టులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement