ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు

Dec 23 2025 7:02 AM | Updated on Dec 23 2025 7:02 AM

ట్రిప

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు బీచ్‌ పర్యాటకుల భద్రతకు డ్రోన్లు ‘చిన్ని చిన్ని మనసులు’కు మరో అవార్డు

నూజివీడు: ట్రిపుల్‌ ఐటీ మెటలర్జికల్‌ విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి అభినందనీయమని మురుగప్ప అసోసియేట్‌ ఉపాధ్యక్షుడు, టెక్నికల్‌ హెడ్‌ సూర్యనారాయణ అన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో మురుగప్ప గ్రూపు ఆధ్వర్యంలో ఎంఎంఈ విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు పరిశ్రమల అంచనాలను ప్రారంభదశలోనే తెలుసుకోవడానికి సాయపడతాయన్నారు. మురుగప్ప గ్రూపు హెచ్‌ఆర్‌ అండ్‌ సేఫ్టీ హెడ్‌ అరుణాచలం మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి పరిశ్రమలకు ఉపయోగపడేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి తగిన శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌, ఎంఎంఈ, కెమికల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకులు పాల్గొన్నారు. ఎంఎంఈ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్‌ కోసం నూతన మిశ్రమలోహాలు అనే అంశంపై వర్క్‌షాపు నిర్వహించారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కోటేశ్వరరావు విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు.

నరసాపురం రూరల్‌: పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల భద్రతను మెరుగుపరచడానికి డ్రోన్ల వినియోగం విప్లవాత్మక మార్పని, వీటి సహకారంతో సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా సహాయం చేసేందుకు వీలు పడుతుందని ఎస్సై జి.వాసు అన్నారు. మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్‌, కేపీ పాలెం సౌత్‌ గ్రామాలలో బీచ్‌లో పర్యాటకుల రక్షణ కోసం సమకూర్చిన డ్రోన్‌ను ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం పరిశీలించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గమనిస్తూ, ప్రమాదకరమైన ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా హెచ్చరించవచ్చన్నారు. దాతలు అందే కాశీ విశ్వేశ్వరరావు రూ.5 లక్షలు, పోలిశెట్టి శ్రీనివాస్‌ రూ.లక్ష రూపాయలు విరాళంగా అందించిన నిధులతో సమకూర్చిన డ్రోన్‌ను బీచ్‌లో ఎగరవేసి పరిశీలించారు.

వీరవాసరం: కొమ్మిరెడ్డి క్రియేషనన్స్‌ బ్యానర్‌పై కొమ్మిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మాతగా, రచయిత అడబాల లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన చిన్ని చిన్ని మనసులు లఘు చిత్రం ప్రత్యేక అవార్డు గెలుచుకుంది. డిసెంబర్‌ 21న రాజమండ్రిలో జరిగిన అభినయ గోదావరి కళానికేతన్‌ అంతర్జాతీయ తెలుగు లఘు చిత్రాల పోటీలలో బెస్ట్‌ అఫ్‌ టెన్‌ ఫిల్మ్‌ అవార్డుతో పాటు, ఉత్తమ సంగీతం అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను డైరెక్టర్‌, కో–డైరెక్టర్‌ అందుకున్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ బృందాన్ని సర్పంచ్‌ గెడ్డం భారతి, వైస్‌ ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కె.సర్వేశ్వరరావు, గెడ్డం భాస్కరరావు అభినందించారు.

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు 
1
1/2

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు 
2
2/2

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement