రైతులను ఆదుకోవాలి
ఎన్నాళ్లీ ‘సెల్’ కష్టాలు.!
శ్రీవారిని దర్శించడం కంటే.. సెల్‌ఫోన్లను భద్రపరచడమే భక్తులకు కష్టంగా మారింది. కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. 8లో u
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు
ఉంగుటూరు: రైతుల తరఫు బీమా చెల్లించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకుంటే ఈ ప్రభుత్వం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శనివారం ఉంగుటూరు మండలంలో దెబ్బతిన్న వరిపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోయారని, బేషరతుగా నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని కోరారు. 20 బస్తాలకు మంచి అవ్వని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 5,500 ఎకరాల పంట దెబ్బతిందని చెప్పారు. ఉచిత పంటల బీమా అమలుచేసింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానని చెప్పి.. కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేవారని తెలిపారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని, అదంతా ఏం చేశారో తెలియదన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. ఆయన మండల పార్టీ అధ్యక్షుడు మరడా మంగరావు, బూత్ విభాగం కార్యదర్శి యెలిశెట్టి పాపారావు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, వీవర్సు విభాగం అధ్యక్షుడు దొంతంశెట్టి సత్యనారాయణ, పెనుగొండ బాలక్రష్ణ, షేక్ బాజి, మంద జయలక్ష్మి తదితరులున్నారు.


