రైతులను ఆదుకుంటాం
నూజివీడు: మోంథా తుపానుతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు వివరాలను నమోదు చేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వీ తెలిపారు. గురువారం ఆమె మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రామన్నగూడెంలో దెబ్బతిన్న మినుము, పత్తి, మీర్జాపురంలో వరి పంటలను పరిశీలించారు. తుక్కులూరులో రామిలేరుపై ఉన్న లోలెవెల్ కాజ్‌వేను పరిశీలించారు. అలాగే తుక్కులూరు పునరావాస కేంద్రంలోని ఐదుగురు వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగలేదని, వరి, మినము పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేయాలని అధికారులకు ఆ దేశించారు. నూజివీడు మండలంలో మినుము పంట ఎక్కువగా దెబ్బతిందన్నారు. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టామని, తుపానుతో నష్టపోయా మని పలువురు రైతులు కలెక్టర్ వద్ద వాపోయారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్ హబీబ్ బాషా, నూజివీడు మండల ప్రత్యేక అధికారి, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సంతోష్, తదితరులు ఉన్నారు.


