లోతట్టు ప్రాంతాలు జలమయం
కై కలూరు: ఎడతెరిపి లేని వర్షాలతో కై కలూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలోనే కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో పలు రోడ్లు వర్షానికి చెరువులుగా మారాయి. కలిదిండి ప్రారంభంలో లాల్వ డ్రైయిన్ అధిక వర్షాలకు మరోసారి కోతకు గురైంది. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించడంతో నియోజకవర్గంలో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.


